🌺 శ్రీ గాయత్రీ ఆస్తానంలో అన్ని రకాల పూజలు, హోమాలు, జపాలు, దోష నివారణ సేవలు మరియు ఆన్‌లైన్ పూజా బుకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది. మీ కుటుంబ శ్రేయస్సు కోసం ఈ రోజే మీ పూజను బుక్ చేసుకోండి. 🙏

శ్రీ లక్ష్మీ గణపతి హోమం వ్యాస పౌర్ణమి

పూజ దానం
Original price was: ₹2,000.00.Current price is: ₹1,000.00.
500+ రేటింగ్‌లు
📱 after 24 hovers send whats app poja video link
🛕 ఈ పూజ తుల్స్య భాగ నదీ తీరం వేదురుపాక శ్రీ వేద మాత గాయత్రీ పీఠం లో జరుగును.This pooja will be held at Sri Veda Matha Gayatri Peetham, located on the banks of the Tulyabhaga River, Vedurupaka.

ఇప్పటివరకు 300+ భక్తులు మా ద్వారా నిర్వహించిన పూజలలో పాల్గొన్నారు.

బుకింగ్ ముగిసే సమయం

00రోజులు
00గంటలు
00నిమిషాలు
00సెకన్లు

పూజ గురించి

🌺 శ్రీ లక్ష్మీ గణపతి హోమం – వ్యాస పౌర్ణమి విశేష పూజ 🌺
తేదీ: జూలై 29, 2026 (వ్యాస పౌర్ణమి / గురు పౌర్ణమి)
సందర్భం: సకల విఘ్న నివారిణి, శ్రీ లక్ష్మీ సమేత గణపతి మహాయజ్ఞం
🌸 హోమం యొక్క ప్రాశస్త్యం
పరమ పవిత్రమైన వ్యాస పౌర్ణమి (గురు పౌర్ణమి) పర్వదినాన శ్రీ లక్ష్మీ గణపతి హోమం నిర్వహించడం అత్యంత ఫలప్రదం. సమస్త విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు మరియు అష్టైశ్వర్యాలను ప్రసాదించే మహాలక్ష్మీ దేవి అనుగ్రహం ఒకేసారి లభించే అరుదైన అవకాశం ఇది.
ఈ మహా హోమంలో మీ కుటుంబ సమేతంగా గోత్రనామాలతో పాల్గొని, లక్ష్మీ గణపతుల దివ్యానుగ్రహం పొందండి.
🌟 హోమంలో పాల్గొనడం వల్ల కలిగే శుభ ఫలితాలు:
* 💰 ధన ప్రాప్తి & ఐశ్వర్య వృద్ధి: వ్యాపారం మరియు ఉద్యోగాలలో ఆటంకాలు తొలగి, ఆర్థిక సంక్షోభాల నుండి విముక్తి లభిస్తుంది. ధన ధాన్యాలు సదా వృద్ధి చెందుతాయి.
* 📜 రుణ విముక్తి: దీర్ఘకాలిక అప్పుల బాధల నుండి ఉపశమనం పొంది, ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది.
* 📈 వ్యాపార వృద్ధి: నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి, ప్రస్తుతం ఉన్న వ్యాపారంలో లాభాలు పొందాలనుకునే వారికి లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది.
* 🕉️ సమస్త కోరికల నెరవేర్పు: జీవితంలో ఎదురయ్యే సకల విఘ్నాలు, నరదృష్టి, గ్రహదోషాలు తొలగి సంకల్పించిన కార్యాలన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి.
🕯️ మీ గోత్రనామాలతో పూజ చేయించుకోండి
ఈ పవిత్రమైన యజ్ఞంలో మీ పేరు మరియు మీ కుటుంబ సభ్యుల గోత్రనామాలను చేర్చి, ప్రత్యేక సంకల్పంతో హోమం జరిపించబడుతుంది. ప్రత్యక్షంగా పాల్గొనలేని వారికి కూడా పూజా ఫలం సంపూర్ణంగా లభించేలా ఏర్పాట్లు చేయబడ్డాయి.
> “విఘ్న నివారణం – అష్టైశ్వర్య ప్రాప్తి – సమస్త కార్యసిద్ధి”
> ఈ పవిత్ర వ్యాస పౌర్ణమి రోజున లక్ష్మీ గణపతి హోమంలో భాగస్వాములై దైవానుగ్రహం పొందండి.

ప్రయోజనాలు

🙏

నష్టాల నివారణ & అద్భుత వ్యాపార వృద్ధి

​వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్లు, పోటీదారుల అడ్డంకులు మరియు నష్టాలు తొలగిపోతాయి. ​కొత్త కొనుగోలుదారులు, కొత్త అవకాశాలు కలిసివచ్చి వ్యాపారం అన్ని కోణాల్లో నిలకడగా విస్తరిస్తుంది.

🙏

లక్ష్మీ కటాక్షం & నిరంతర ధన వృద్ధి

​ఇంట్లో మరియు వ్యాపార సంస్థల్లో ధన ప్రవాహం పెరిగి ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ​చేతిలో డబ్బు నిలకడగా ఉండటమే కాకుండా, రాబడి క్రమక్రమంగా పెరుగుతూ ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది.

🙏

ఆర్థిక సమస్యల తొలగింపు & శీఘ్ర రుణ విముక్తి

​దీర్ఘకాలికంగా వేధిస్తున్న అప్పుల బాధల నుండి బయటపడేందుకు తగిన మార్గాలు మరియు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తాయి. ​పేరుకుపోయిన బకాయిలు వసూలై, ఆర్థిక భారాలు మరియు అప్పుల ఒత్తిడి నుండి విముక్తి కలుగుతుంది.

🙏

అష్టైశ్వర్య ప్రాప్తి & సమృద్ధి లక్ష్మీ యోగం

భోగభాగ్యాలు, ఆస్తుల వృద్ధి మరియు అష్టైశ్వర్యాలు సమకూరి కుటుంబం ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. ​ఇంట్లో మరియు వ్యాపారంలో దరిద్ర బాధలు తొలగి, శాశ్వత ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది.

ప్రక్రియ

1

శ్రీ విఘ్నేశ్వర పూజ

ఏ పూజ లేదా కార్యక్రమం ప్రారంభించినా ఎటువంటి అడ్డంకులు కలగకుండా, విజయవంతంగా పూర్తవ్వడానికి ముందుగా విఘ్నేశ్వరుడిని ఆరాధించడం మన సాంప్రదాయం. ఈ హోమంలో కూడా తొలిగా గణపతిని ఆవాహన చేసి, షోడశోపచార పూజలు నిర్వహిస్తారు. ఈ ప్రథమ పూజ వల్ల మన మనస్సులోని సంకల్పానికి బలంతో పాటు, తలపెట్టిన హోమ ప్రక్రియ అంతా నిర్విఘ్నంగా నెరవేరడానికి శ్రీ గణపతి అనుగ్రహం లభిస్తుంది.

2

దివ్యశక్తి ఆవాహన – మండప ఆరాధన

విఘ్నేశ్వర పూజ అనంతరం ప్రధాన హోమ క్రమం కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన మండపంలో దేవతలను ఆవాహన చేస్తారు. వివిధ దిక్కులకు అధిపతులైన దిక్పాలకులు, గ్రహ దేవతలు మరియు లక్ష్మీ సమేత గణపతిని మండపంలో ప్రతిష్ఠించి ఆరాధిస్తారు. ఈ మండప ఆరాధన ద్వారా హోమ ప్రాంగణమంతా దివ్యమైన మంత్రశక్తితో, సానుకూల తరంగాలతో (Positive Energy) నిండిపోయి ఆవరణ శుద్ధి జరుగుతుంది.

3

మంత్రసిద్ధి & ఏకాగ్రత – లక్ష్మీ గణపతి మూలమంత్ర జపం

హోమానికి ముందు లక్ష్మీ గణపతి అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధించడం కోసం వేద పండితులచే శక్తివంతమైన 'లక్ష్మీ గణపతి మూలమంత్ర జపం' జరుగుతుంది. బీజాక్షరాలతో కూడిన ఈ మూలమంత్రాన్ని నిర్దిష్ట సంఖ్యలో జపించడం వల్ల వాతావరణంలో అపారమైన ఆధ్యాత్మిక శక్తి ఉత్పన్నమవుతుంది. ఈ జప ప్రక్రియ వల్ల లక్ష్మీదేవి మరియు గణనాథుల కటాక్షం లభించి, సంకల్ప సిద్ధి త్వరితగతిన లభిస్తుంది.

4

పంచామృత అభిషేకం

అనంతరం స్వామివారికి క్షీరం (పాలు), దధి (పెరుగు), ఆజ్యం (నెయ్యి), మధువు (తేనె), శర్కర (చెక్కర)లతో కూడిన పవిత్ర పంచామృతాలతో విశేష అభిషేకం నిర్వహిస్తారు. ప్రతి ద్రవ్యానికి ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంటుంది. లక్ష్మీ గణపతికి పంచామృత అభిషేకం చేయడం వల్ల మానసిక ప్రశాంతత, దేహ దార్ఢ్యం, సకల పాప నివారణ మరియు లక్ష్మీదేవి అనుగ్రహంతో కుటుంబంలో శుభాలు కలుగుతాయి.

5

అష్టద్రవ్య హోమము

హోమ గుండంలో లక్ష్మీ గణపతి మూలమంత్రాల ఉచ్ఛారణతో పాటు కొబ్బరి ముక్కలు, కొబ్బరి పీచు, చెరుకు ముక్కలు, నల్ల నువ్వులు, అటుకులు, బెల్లం, అరటిపండ్లు, నెయ్యి వంటి 'అష్టద్రవ్యాలను' ఆహుతిగా సమర్పిస్తారు. గణపతికి ఎంతో ప్రీతికరమైన ఈ అష్టద్రవ్య హోమం చేయడం వల్ల సమస్త విఘ్నాలు తొలగిపోయి, అష్టైశ్వర్యాలు, వ్యాపార వృద్ధి, రుణ విముక్తి మరియు సకల ఐశ్వర్య ప్రాప్తి శీఘ్రంగా సిద్ధిస్తాయి.

ఆలయం

తూర్పు గోదావరి జిల్లా, వెదురుపాక గ్రామంలోని తుల్యాభాగ నదీ తీరంలో స్వయంభూగా వెలిసిన శ్రీ గాయత్రీ దేవి స్థానం అత్యంత శక్తివంతమైనది. దివ్యమైన నదీ తీర ప్రాశస్త్యంతో పాటు మహా శక్తిపీఠ విశిష్టత కలిగి ఉన్న ఈ క్షేత్రంలో ఏ పూజ, జపం లేదా హోమం నిర్వహించినా దానికి కోటి రెట్ల పుణ్యఫలితం లభిస్తుందని ప్రసిద్ధి. అపారమైన ఆధ్యాత్మిక చైతన్యం ఉత్పాదకమయ్యే ఈ పుణ్యక్షేత్రంలో జరిగే లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొనడం వల్ల అమ్మవారి దివ్య కటాక్షంతో పాటు గణనాథుని అనుగ్రహం లభించి, సమస్త పాపాలు-విఘ్నాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు, వ్యాపార అభివృద్ధి మరియు సర్వాభీష్ట సిద్ధులు శీఘ్రంగా నెరవేరుతాయి.

మీకు లభించేవి

  • మీ గోత్రనామాలతోటి సంపూర్ణ హోమ ప్రక్రియ అంతా కూడా చేయించడం జరుగుతుంది
  • పూజ చేసిన లక్ష్మీ గణపతి డాలర్ ప్రసాదంగా పంపించడం జరుగుతుంది
  • పూజలో పెట్టిన లక్ష్మీ గణపతి యంత్రం ప్రసాదముగా పంపించడం జరుగుతుంది
  • చేతికి కట్టుకోవడానికి రక్ష , ఆశీర్వచన అక్షతలు కుంకుమ , డ్రై ఫ్రూట్స్ ప్రసాదం కొరియర్ లో పంపించడం జరుగుతుంది

ప్రశ్నలు

ఈ పూజలో ఎవరు పాల్గొనవచ్చు

వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడేవారు, రుణ బాధలతో ఇబ్బంది పడేవారు.

ఈ పూజలో స్వయంగా వచ్చి పాల్గొనవచ్చా

అవును మీరు కావాలంటే వెదురుపాక గ్రామం, రాయవరం మండలం ,తూర్పుగోదావరి జిల్లా, శ్రీ గాయత్రి పీఠానికి స్వయంగా వచ్చి పూజ చూడవచ్చు ,కానీ పూజ అంతా బ్రాహ్మలే చేస్తారు.

భక్తుల విశ్వాసం

500+కుటుంబాలు ఆశీర్వాదాలు పొందాయి
1000+పూజలు విజయవంతంగా పూర్తయ్యాయి
Scroll to Top
Original price was: ₹2,000.00.Current price is: ₹1,000.00.